న్యాయ విద్యార్థుల్లో నాయకత్వం నింపేందుకు కొన్ని న్యాయ కళాశాలల చొరవకు,వాటి అధ్యాపకులకు అభినందనలు…

BMS Law College, Bangalore @ on the occasion of campus students election.

రేపటి న్యాయ వ్యవస్థను పటిష్టం చేసేందుకు నేటి నుంచే కొన్ని న్యాయ విద్యను అందించే కళాశాలలు విద్యార్థి దశ నుంచే తమ న్యాయ విద్యార్థులకు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో కళాశాల స్టూడెంట్స్ కమిటీ ఎలక్షన్ లు. ఇదే తరహాలో బెంగళూరుకు చెందిన బి ఎం ఎస్ లా కళాశాల ఏటా స్టూడెంట్స్ ఎలక్షన్లను నిర్వహిస్తుంది. చురుకైన న్యాయకత్వం కలిగి గెలిచిన న్యాయ విద్యార్థులను అభినందించి మరింత ప్రోత్సహిస్తారు.

హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత విద్య అందించే కళాశాలలలో స్టూడెంట్ కమిటీ ల ఎలక్షన్ల పై ప్రభుత్వం చే నిషేధిత ఆంక్షలు ఉండడంతో ఏ కళాశాల కూడా విద్యార్థి కమిటీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. కానీ కొన్ని కళాశాలలో వివిధ మార్గాల ద్వారా తాము ఎంచుకున్న న్యాయవృత్తిలో నాయకత్వ లక్షణాలను అందించేందుకు తమ విద్యార్థులను వినూత్న రీతిలో ప్రోత్సహిస్తూ ఉంటాయి.

ఉన్నత విద్య మరియు వృత్తి కళాశాలలో విద్యార్థి కమిటీల ఎన్నికలు నిషేధించడానికి గల కారణాలలో వారసత్వ రాజకీయాలు అని కొంతమంది అంటుంటారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు చిగురించి రేపు వారు రాజకీయ రంగంపై దృష్టి పెడితే తమ భవిష్యత్తు, తమ వారసత్వ రాజకీయరంగ ప్రవేశానికి గొడ్డలి పెట్టు అవుతుందని, కొంతమంది కుట్రపూరితంగా ఉన్నత విద్య మరియు వృత్తి కళాశాలల్లో విద్యార్థి కమిటీ ఎన్నికలు నిషేధించారని ఆరోపిస్తుంటారు.

ఏది ఏమైనా ఒక న్యాయ విద్యార్థి న్యాయ పట్టా పుచ్చుకొని న్యాయవృత్తిలో విజయవంతంగా రాణించాలంటే ప్రశ్నించే నైజం, విమర్శించే చాకచక్యం, పోరాడే గుండె ధైర్యం తప్పనిసరి. ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్న విద్యార్థులను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నేటి న్యాయ కళాశాలలు ప్రోత్సహించకపోగా… ఒకింత ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. కారణాలు ఎన్నో….!

ఏది ఏమైనా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ విద్యలో సమూల మార్పులు రావాల్సి ఉంది. న్యాయ విద్య, ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాల పట్ల ఉన్న అవగాహన లోపాన్ని చెరిపేయాల్సి ఉంది. న్యాయ వృత్తి యొక్క ఔన్నత్వాన్ని సమాజానికి తెలియజేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవిద్య వైపు రేపటి విద్యార్థులను పరుగులు పెట్టించాల్సి వుంది. న్యాయవిద్య ప్రమాణాలను పెంపొందించాల్సి ఉంది. దూర విద్యా విధానంలో అందించబడుతున్న రెగ్యులర్ కోర్సుల న్యాయవిద్యను పూర్తిస్థాయిలో రెగ్యులర్ రైజ్ చేయాల్సి ఉంది.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started